టీడీపీ పార్టీ కోసం చాల మంది కార్యకర్తలు ఎంతో కృషి చేసారు. టీడీపీ పార్టీ కోసం ఎన్నో లాఠీ దెబ్బలను ఓర్చుకున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు. ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు చాల కష్టపడి పార్టీని గెలిపించారు. అలా టీడీపీ కోసం పని చేసిన నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం అన్ని సమస్యల్లో, అందుబాటులో ఉండాలని చంద్రబాబు మంత్రులకు సూచనలు ఇచ్చారు. మంత్రులకు కొత్త బాధ్యతలను అప్పగించారు.
ప్రతి ఒక్కరి సమస్యని వినాలి వాటిని పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి సూచించారు. ఈరోజు నుండి అందుబాటులో ఉంటున్న మంత్రుల వివరాలు చంద్రబాబు వెల్లడించారు. జులై 17వ తేదీన బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్ సవిత, జులై 18 న మైనార్టీ శాఖా మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, జులై 19న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జులై 22న గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇక జులై 23న గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, జులై 24 వ తేదీన రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జులై 25 వ తేదీన రాష్ట్ర కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ తదితరులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు అని చంద్రబాబు తెలిపారు.