CM Revanth: తెలంగాణలోని మొత్తం 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి సదుపాయాలతో పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కళాశాలలో అవసరమయ్యే వసతులు, నిధుల మొత్తాలు, తక్షణమే చేయాల్సిన పనులు, ప్రభుత్వ సహాయం వంటి విషయాలపై సమగ్రమైన నివేదిక అందించాలన్నది సీఎం ఆదేశం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కమిటీని నియమించి, కళాశాలలన్నీ సందర్శించి నివేదిక సమర్పించాలన్నారు.
సోమవారం ఐసీసీసీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంసీ (జాతీయ వైద్య మండలి) సంస్థ రాష్ట్ర వైద్య కళాశాలలపై ఎత్తిచూపిన సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీ, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, ఆసుపత్రులలో పడకల పెంపు, అవసరమైన పరికరాలను సమకూర్చటం, ఖాళీలను భర్తీ చేయడం వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం తరపున అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని, కేంద్రానికి సంబంధించిన అనుమతులు, నిధుల సమస్యలు ఉంటే వెంటనే తెలపాలని సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాను సంప్రదించి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.
నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్‌గా బోధించాలని సీఎం తెలిపారు. జపాన్‌లో భారతీయ నర్సులకు ఎక్కువ డిమాండ్ ఉందని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా జపాన్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందని తెలిపారు. ఆసుపత్రులలో వచ్చే రోగుల వివరాలు, వైద్యుల సేవలు, పని వేళల పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేయాలన్న అంశంపై అధికారులకు సూచించారు. విద్య మరియు వైద్య రంగాలు అత్యంత ప్రాధాన్యత గలవని పేర్కొంటూ, ప్రతి నెల మూడవ వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని CM Revanth ఆదేశించారు.
Internal Links:
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించిన మంత్రి కొండా సురేఖ
సెక్రటేరియట్లో కొత్త మంత్రులకు ఛాంబర్లు..
External Links:
వైద్య కళాశాలల పనులపై కార్యాచరణ ప్రణాళిక.. అధికారులకు సీఎం ఆదేశం..!