MLC Kavitha: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం తీవ్రతరం అవుతోంది. మెదక్ జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయించేందుకు బీసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ జాగృతి మరియు UPF బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు అయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. మెదక్ జిల్లాలో బీసీల సభ ఏర్పాటు చేస్తే కొందరు నాయకులు బెదిరిస్తున్నారని సమాచారం ఉందని చెప్పారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ వేదిక కాదని, బీసీల హక్కుల సాధన కోసం జరుపుతున్న కార్యక్రమమని పేర్కొన్నారు.
ఇంకా మాట్లాడుతూ, జాగృతి మరియు UPF సరైన సమయంలో బీసీ సమస్యలపై మాట్లాడినందువల్ల అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. అయితే, ఆ బిల్లులను కేంద్రానికి పంపిన తర్వాత కాంగ్రెస్ నేతలు తమ బాధ్యతల నుండి తప్పించుకున్నారని విమర్శించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇప్పటి వరకు బీసీ బిల్లుపై ఒక్క రోజు అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కులగణనలో బీసీల జనాభాను తక్కువగా చూపించినట్టు ఆరోపించారు. నిజమైన కులగణన చేసేందుకు చిత్తశుద్ధితో ప్రతి గ్రామంలో పకడ్బందీగా లెక్కలు వేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుంది. జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో రైల్ రోకో చేపట్టనున్నట్టు MLC Kavitha హెచ్చరించారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించేవరకు అన్ని బీసీ సంఘాలను ఒక్కటిగా చేసి అనేక రకాల కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో కూర్చొన్న నాయకులకు దక్కన్ పీఠభూమి శక్తి ఏంటో తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తే, తగిన స్పందన చూడాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఇది రాజకీయాలకంటే మించిన ప్రజా హక్కుల పోరాటమని తేల్చిచెప్పారు.
Internal Links:
కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించిన మంత్రి కొండా సురేఖ
External Links:
కాంగ్రెస్ కులగణనలో బీసీల జనాభా తక్కువ చేసి చూపించారు