CM Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉండటంతో, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైతే తాత్కాలిక ఆశ్రయాల కోసం పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోకుండా అధికారులు ముందుగానే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రమాదం తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్‌లో వర్షాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు GHMC, అగ్నిమాపక, SDRF, ట్రాఫిక్, పోలీసు విభాగాలు కలిసి పని చేయాలని సీఎం ఆదేశించారు. వాగులు, చెరువులు, కుంటలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో వాటిపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ చెరువుల భద్రతా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు అవసరం లేని ప్రయాణాలు చేయకూడదని, ముఖ్యంగా బలహీనమైన ఇళ్లలో, వాగు, చెరువు, నది పక్కన నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వర్షాల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు, ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
Internal Links:
తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌గా సుశీలా కర్కి..
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..
External Links:
రాష్ట్రంలో వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు