తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావు నియమితులవుతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితకు బెయిల్ కూడా త్వరలోనే వస్తుందని విలీనంలో భాగంగా ఆమెను రాజ్యసభకు పంపుతారని నొక్కి చేప్పారు.
బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వీరి అవసరం బీజేపీకి ఉందని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.