తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగగా జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు.
ఆయన ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ రెడ్డికి ఆయన మనవడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి, శారద, సుజాత రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.