బిగ్ బాస్ సీజన్ కు ఎంపికైన నూతన్ నాయుడు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాడు. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి మృదుస్వభావిగా కనిపించిన నూతన్ నాయుడు, సామ్రాట్, తనీష్ లతో గొడవపడి పాపులర్ అయ్యాడు. కానీ చివరి వరకు నిలవలేదు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2లో కూడా నూతన్ నటించాడు. అయితే ఆ తర్వాత సినిమా అవకాశాలు రాలేదు. 2009లో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు.
విశాఖలో దళిత యువకుడికి గుండు కొట్టించిన విషయంలో చిక్కుకున్న నూతన్ నాయుడు, ఆ తర్వాత ఎలాగోలా బయటపడ్డారు. ఆ తర్వాత జనసేనలో చేరేందుకు కూడా చాల కష్టపడ్డారు. కానీ ఫలితం లేదు . ఇవాళ ఆయన వైఎస్ షర్మిల సమక్షంలో నూతన్ నాయుడు కాంగ్రెస్ లో చేరడం విశేషం. ఆయన సేవల్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై షర్మిల త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.