హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్ చేసింది. పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది.
మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చారు. సీఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.