మాజీ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పైలట్ అయ్యారు. ఆయన స్వయంగా విమానం నడిపారు. కేతిరెడ్డి ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానాన్ని నడుపుతూ, హైదరాబాద్ గగన వీధుల్లో ప్రయాణించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తన కల నిజమైందని, ఇప్పుడు తాను సర్టిఫైడ్ పైలట్ అని ఆయన అన్నారు.
ఆకాశం ఇక హద్దు కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి సవాలుకు, ప్రతి పాఠానికి మరియు ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.ఇక మీదట అంతులేని సాహసాలే. ఇది నా మొదటి సోలో ఫ్లైట్, దానికి నేను వింగ్స్ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ మేరకు తన ఫస్ట్ ఫ్లయింగ్ వీడియోను కూడా పంచుకున్నారు.