మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్టు అయ్యారు. ఏపీ పోలీసులు గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపీనాథ్‌ను అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి అతడిని ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు తీసుకున్నందుకు కేసు నమోదు చేసిన ఏసీబీ ఇటీవల అతడిని అరెస్టు చేశారు.
మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా, ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.