Singareni: సింగరేణి, నైని బొగ్గు బ్లాక్ అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సింగరేణి ఆత్మలాంటిదని, అలాంటి సంస్థపై తప్పుడు కథనాలు, కట్టుకథలు రాస్తూ 42 వేల మంది ఉద్యోగులు, 20 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకుండా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
సింగరేణి ఒక ఆటానమస్ సంస్థ అని, టెండర్లలో సైట్ విజిట్ నిబంధన కొత్తది కాదని భట్టి స్పష్టం చేశారు. కోల్ ఇండియా, సీఎంపీడీఎల్, ఎన్ఎండీసీ, రైల్వే వంటి కేంద్ర సంస్థల టెండర్లలో కూడా ఇదే నిబంధన ఉందని తెలిపారు. పారదర్శకత కోసమే నిర్ణయాలు తీసుకున్నామని, విచారణకు ఆదేశించిన కిషన్ రెడ్డి చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
తెలంగాణ కు ఆత్మ సింగరేణి.. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు