Indiramma Houses Core Review

Indiramma Houses Core Review: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ (Core Urban Region) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల వివిధ శాఖలకు చెందిన నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఉపయోగంలో లేని స్థలాలను ఇందిరమ్మ ఇండ్ల కోసం వినియోగించి, అవసరమైతే సంబంధిత శాఖలకు వేరే చోట భూమి కేటాయించాలని చెప్పారు. జనావాసాలకు దూరంగా ఇళ్లు నిర్మిస్తే ఉద్యోగాలు, ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే ప్రజలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు.

క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో తొలి దశలో 7,680 ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో ఫ్లాట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లాట్‌కు సుమారు రూ.11 లక్షల వ్యయం కాగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. భూమి ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం నిరుపయోగ ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *