Harish rao: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ లో అంతర్గత సమస్యలు ఎక్కువయ్యాయి. కల్వకుంట్ల కవిత, హరీష్ రావు పై అవినీతి ఆరోపణలు చేస్తూ బహిరంగంగా మాట్లాడింది. సంతోష్ రావు కూడా కుట్రలు పన్నుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. దీంతో పార్టీ లో కలకలం రేగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఈ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న హరీష్ రావు నేడు హైదరాబాద్ చేరుకుని తొలిసారి స్పందించారు. కవిత వ్యాఖ్యలు కావాలనే దుష్ప్రచారమేనని, వాటిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.
హరీష్ రావు మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకంలాంటిదని, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర అందరికీ తెలిసినదని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశానని తెలిపారు. ఉద్యమంలో పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించామని, ఎవరో అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన అవి నిజం కావని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని, ప్రజల కష్టాలు తగ్గేలా కలిసికట్టుగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.
Internal Links:
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం..
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
External Links:
కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు..