Harish Rao Meets KCR: హైదరాబాద్‌లోని నందినగర్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా సమావేశమయ్యారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సీఎంల సమావేశం ఎజెండాలో చేర్చిన నేపథ్యంలో, ఈ సమావేశంలో ఆ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి ఈ ప్రాజెక్టును ఎజెండా నుంచి తొలగించాలని కోరింది. బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల ప్రాజెక్టుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉందంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేశారు.
బనకచర్ల ప్రాజెక్టు విషయంపై మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పోరాటానికి సిద్ధమవుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావుల భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాజెక్టును వ్యతిరేకించే వ్యూహాలపై ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
Internal Links:
బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదు..
External Links:
కేసీఆర్తో హరీష్ రావు సమావేశం.. బనకచర్ల ప్రాజక్టుపై చర్చ!