బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై కేసు నమోదైంది. హరీశ్ రావు తమ్ముడు మరదలు, మేనమామ, మరో ముగ్గురిపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అక్రమ కార్యకలాపాలు, అవకతవకలకు సంబంధించి ఫాస్మో కంపెనీపై కేసులు నమోదు చేశారు. మియాపూర్‌లో దండు లచ్చిరాజు అనే వ్యక్తికి చెందిన ఐదు ఆస్తులను తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల తనకు తెలియకుండా ఇంటిని విక్రయించారని లచ్చిరాజు మియాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు అతనిపై ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, లచ్చిరాజు తన ఆస్తి కోసం 2019 నుంచి గొడవ పడుతున్నట్లు సమాచారం.