హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలుండగా 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. 20,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు కొనసాగనుంది. నువ్వా.. నేనా అన్నట్టు జరుగుతుంది . హర్యానాలో బీజేపీ పదేళ్లుగా పాతుకుపోయింది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది, ఈసారి కాషాయ పార్టీకి విజయం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగా ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణాలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలిచి అధికారం సొంతం చేసుకోవాలనుకుంటోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *