నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సమావేశాలలో ప్రధాన అంశాలపై అన్ని పక్షాల మద్దతు పొందడానికి, నిన్న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే, విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను విస్మరిస్తూ, తమ అనుకూలమైన అంశాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చూస్తోందని అవి ఆరోపించాయి. ఈ నేపథ్యంలో, పార్లమెంటు సమావేశాలు వివిధ అంశాలపై తీవ్ర చర్చలకు వేదిక కావొచ్చని అంచనా వేయవచ్చు.