News5am, Latest Telugu Breaking News (15-05-2015): తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా బేసిన్‌లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించాలని, నిధుల కొరత రాకుండా ఆర్థిక శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ త్వరితంగా జరగేందుకు రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకోవాలని, స్పెషల్ ఆఫీసర్లు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. తాజాగా నియామితులైన 244 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు జలసౌధలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నీటి
పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం సీఎం జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు 18 నెలల్లో పూర్తిచేయాలని సూచించారు. కోయిల్ సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్ వరకు, మహాత్మగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ డిసెంబర్ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు కావాల్సిన నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
More Latest News:
Latest Telugu Breaking News:
ఎస్-400 ముందు గర్వంతో నిల్చుని ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు..