వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు పులివెందులకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. మరికాసేపట్లో బెంగళూరు నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పెండ్లిమర్రి మండలం మాచనూరుకి వెళ్తారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచనూరి చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
అనంతరం పార్టీ శ్రేణులతో కాసేపు గడిపి గొందిపల్లికి చేరుకుంటారు. కడప మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. కొత్త దంపతులను ఈ సందర్భంగా జగన్ ఆశీర్వదిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. రాత్రికి పులివెందులలో జగన్ విశ్రాంతి తీసుకుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సోమవారం జరగనుంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద జగన్ నివాళులర్పిస్తారు. అదే రోజున ఆయన తాడేపల్లికి చేరుకోనున్నారు. సెప్టెంబర్ 4న ఆయన లండన్ కు వెళ్లే అవకాశం ఉంది.