మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.
రేపు ఉదయం 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకుని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళతారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరుతారు. ఇటీవల లింగమయ్య హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఆయనను దారణంగా హత్య చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.