ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ జనవాణికి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను జనసేన స్వయంగా కలుసుకుని, వారి నుండి పత్రాలను తీసుకొని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం అమలుపై జనసేన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘జనవాణి’కి వచ్చే ప్రజల సౌకర్యార్థం వేసవి కాలం దృష్ట్యా ఈ కార్యక్రమం పనివేళలను మార్చినట్లు పార్టీ ప్రకటించింది. ఇక నుంచి సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు, ఆపై సాయంత్రం 4.30 నుండి 5.30 వరకు నిర్వహిస్తారు. ఈ కొత్త పనివేళలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని జనసేన తెలిపింది. మంగళగిరి జన సేన పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.