బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి ఆలయానికి చేరుకున్న కవితకు ఆలయ పూజారులు మరియు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం, శ్రీ లక్షి తాయారమ్మ ఆలయంలో పండితులు వేద ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా కవితతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, చంద్రావతి, రేగాకాంతరావు తదితరులు పాల్గొన్నారు.