బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్ళారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలవబోతున్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత కేసీఆర్‌తో ఆమె భేటీ కానున్నారు. నిన్న హైదరాబాద్ చేరుకున్న (కవిత) కుమార్తెతో కేసీఆర్ మాట్లాడారు. ఈరోజు కవితను భోజనానికి పిలిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్ట్ అయి ఐదున్నర నెలల పాటు తిహాద్ జైలులో ఉన్న కవితకు ఈ నెల 27న బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.
శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కవితపై పూలవర్షం కురిపించారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసి కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌కు చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కవిత, సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్న కవిత, తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపి ఇంట్లోకి స్వాగతం పలికారు, కుటుంబ సభ్యులను చూసి కవిత భావోద్వేగానికి గురయ్యారు. కాగా, కవిత ఇవాళ తన తండ్రి కేసీఆర్‌ను కలవనున్నారు.