కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుముశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సకలమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి తరలి వెళ్లారు. ఆమె భౌతికకాయానికి ఓల్డ్ అల్వాల్‌లోని టీఎస్‌ఆర్ గోల్డెన్ లీఫ్ అపార్ట్‌మెంట్‌కు తరలించినట్లు సమాచారం. శనివారం అంత్యక్రియాలు జరగనున్నాయి.