త్వరలో ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల పనులు ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కళాశాల నిర్మాణానికి రఘునాథపాలెంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య విద్య బోధన, వసతి గృహాల నిర్మాణాలను అధికారులు పరిశీలించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పాత కలెక్టరేట్ స్థలం భవిష్యత్తు అవసరాలకు సరిపోదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా రఘునాథపాలెం మండలంలో 35 ఎకరాలను ఎంపిక చేశారు. అధునాతన సౌకర్యాల కోసం అన్ని భవనాల నిర్మాణాలను త్వరగా చేపట్టి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తెచ్చేలా అధికారులను నియమించారు.