News5am, Latest Breaking News (30-05-2025): సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ, స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలయినా కశ్మీర్ సమస్య ఇంకా కొనసాగుతుండటానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. అప్పట్లో కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి వివాదానికి బీజం వేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. అప్పట్లో ఇందిరా గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపేసి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేదా? అని నిలదీశారు. ఆర్టికల్ 370 రద్దుచేసి కశ్మీర్‌ను భారత్‌లో కలిపిన నాయకుడు నరేంద్ర మోడీ అని, మోడీని విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మివేయడమనని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని కోరిన నాయకుడే మోడీ అని ప్రశంసించారు. సమస్యల పరిష్కారమే ముఖ్యం అని, దేశ భద్రత గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటమే దయ్యాలు వేదాలు వల్లించడంలా ఉందని విమర్శించారు.
రాజకీయ లాభం కోసం చెప్పే మాటలు సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జైహింద్ పేరిట సైనికుల కోసం ర్యాలీలు నిర్వహించి, ఆ తరువాత రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని చెప్పడం ఎంతవరకు సబబు? మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు. ఢిల్లీలో మోడీని పొగడ్తలతో ముంచెత్తి, స్థానికంగా వచ్చి తిడతారా? అని నిలదీశారు. కేంద్రం చేసిన మంచి పనుల్ని మీ మంత్రులు ప్రశంసిస్తారు, కానీ మీరు మాత్రం విమర్శిస్తారు , ఇది మీ నిజమైన స్వభావమా? అని ప్రశ్నించారు. మల్కాజ్గిరి ప్రజలు నమ్మకంతో గెలిపించారని, కానీ ఇప్పుడు వారికి బాధ కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. హైడ్రాను తీసుకొచ్చి ప్రజలను బాధపెడుతున్నారు, నమ్మకంతో గెలిపించిన వారిని దెబ్బతీసేలా చేస్తూ, వారి కన్నీళ్లను చూస్తూ ఆనందిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Latest Breaking News:
Latest Breaking News:
ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం కౌంటర్..
మంత్రులకు సీఎం ప్రత్యేక డిన్నర్..
More Latest Breaking News: External Sources
“ఆనాడు మీరు చేసిందేంటి?”.. కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?