Harish Rao Slams Revanth Reddy

News5am, Latest Telugu News Breaking (31-05-2025): హిమాచల్ ప్రదేశ్‌లో తెల్ల ఏనుగు లాంటి హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు టీజీ జెన్‌కోను రంగంలోకి దింపుతూ, సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాన్ని అవలంబిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. అప్పులు తీసుకునే పరిస్థితి లేదని, ఎవరూ నమ్మడం లేదని ప్రతి వేదికపై చెబుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ హైడల్ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.6,200 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

హిమాచల్ హైడల్ ప్రాజెక్టు నుంచి మోసర్ బేర్ లాంటి ప్రముఖ కంపెనీ ఇప్పటికే వెనక్కి తగ్గగా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మూడు సంవత్సరాల పరిశీలన అనంతరం ఇది సాధ్యం కాదని వదిలేసిన సందర్భంలో 510 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి టీజీ జెన్‌కో ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వివరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

More Latest Telugu News Buzz:

Telugu News Breaking:

సీఎం వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఫైర్..

ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం కౌంటర్..

More Latest Telugu News: External Sources

హిమాచల్ హైడల్ ప్రాజెక్టుకు డబ్బులెక్కడివి .. సీఎం రేవంత్​ను​ ప్రశ్నించిన హరీశ్​రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *