News5am Latest Telugu News (10/05/2025) : హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, పాకిస్తాన్ తరచూ మజాక్ చేస్తున్నదని, దాడికి తెగబడితే భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గదన్నారు. ఇస్లాం అమాయకులు, చిన్న పిల్లలను చంపమని చెప్పలేదని స్పష్టంగా చెప్పారు. భారత జవానులకు మద్దతుగా మనమంతా నిలబడాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశ భూమి కోసం చచ్చే వరకు బ్రతకాలని ఎమోషనల్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని, దానికి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
“ఇస్లాం అమాయకులను, చిన్న పిల్లలను చంపమని చెప్పలేదని వెల్లడించారు. మనం జవానులకు మద్దతుగా నిలవాలి. పాకిస్తాన్ తరచూ మజాక్ చేస్తోంది. దాడికి వస్తే భారత్ వెనక్కి తగ్గదు. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమానికి పాల్పడుతోంది. అమాయకులను, చిన్నారులను చంపే హక్కు పాకిస్తాన్‌కు లేదు. ఇస్లాం పేరు చెప్పే అర్హత కూడా లేదు. మనం ఈ భూమిపై పుట్టిన రోజు నుంచే ఈ భూమికోసం బ్రతికేలా ఉండాలి” అని ఒవైసీ తెలిపారు.