CM Revanth Team

News5am Latest Telugu News (08/05/2025) : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ఈ ర్యాలీ మే 8, గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు జరగనుందని సీఎం తెలిపారు. యువత ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సమయంలో బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్ అనంతరం ఏర్పడిన పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్షించారు. భద్రతా చర్యలు, కార్యాచరణకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో సమన్వయంగా పనిచేయాలని తెలిపారు. అత్యవసర సేవలపై ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలని, నిత్యావసర వస్తువుల లోపం తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. రక్షణ రంగ సంస్థలు, శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని సూచించారు. తెలంగాణను సందర్శించే వ్యక్తులకు సముచిత భద్రత కల్పించాలని, రాష్ట్ర నిఘా బృందాలు కేంద్ర నిఘా సంస్థలతో సమన్వయంగా పనిచేయాలని సీఎం పేర్కొన్నారు.

Latest Telugu News

Latest Telugu News :

కరోనా కొత్త వేరియంట్..

నిప్పుతో ఆటలొద్దురోయ్ అంటూ దిగ్వేశ్ ని ట్రోల్ చేస్తున్నారు..

More Latest News : External sources

https://ntvtelugu.com/news/cm-revanth-reddy-solidarity-rally-operation-sindoor-795585.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *