Minister Narayana: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం కింద డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ వైఫల్యాల నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే మేల్కొంటుందని చెప్పారు. వచ్చే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అలాగే, రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు సహా రాష్ట్ర ప్రభుత్వం కలిపి రూ.20 వేలు అందించనున్నట్టు తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టులో ఉన్న సమస్యలు రెండు, మూడు నెలల్లో పరిష్కరించి ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పాజిటివ్‌గా తీసుకుని, మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు సీఎం ఆమోదం తెలిపారు. ఆర్థిక శాఖతో చర్చల అనంతరం నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామని వెల్లడించారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోందని, దోషులపై కఠిన చర్యలు తప్పవని నారాయణ హామీ ఇచ్చారు.
Internal Links:
బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదు..
బండి సంజయ్ పుట్టినరోజు కానుకగా 20 వేల సైకిళ్ల పంపిణీ..
External Links:
రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రూ. 20 వేలు