తిరుమలలో సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించి బ్రేక్ దర్శనాల సంఖ్యను పెంచారని, ఇదేనా సనాతన ధర్మం? అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు.
అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి దర్శనం టిక్కెట్లు అమ్ముకున్న వారు ఇప్పుడు నీతులు చెప్పడం వింతగా ఉందని ఎత్తి చూపారు. ఒక్కో సిఫారసు లేఖ మీద 100 మందికి దర్శనాలు చేయించిన ఘనత మీది కాదా? అని రోజాను ప్రశ్నించారు. తిరుమల లడ్డూని కూడా వదలకుండా అన్ని రకాలుగా అపవిత్రం చేసిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే రోజా గారూ అంటూ మంత్రి వాసంశెట్టి ధ్వజమెత్తారు.