బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికపై విమర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు @TelanganaCMO. గడిచిన పది నెలల్లో ఒక్క అసెంబ్లీలో అయినా కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా మాట్లాడారా? ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు చెప్పిన టీచర్ పోస్టులు కేసీఆర్ ఇచ్చారని, విద్యాశాఖలో 3202 పోస్టులు, యూనివర్సిటీలో 1081 పోస్టులు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం మంజూరు చేసినవి కావా?. ఇంటర్, టెక్నికల్, కాలేజియేట్ విద్యకు సంబంధించి 3896 మంది కాంట్రాక్టు ఉద్యోగులను కేసీఆర్ తరచూ నియమిస్తున్నారని చెబితే బాగుంటుంది. ఎన్నికల ముందు మీరు చెప్పిన 25 వేల టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదో టీచర్లకు చెబితే బాగుండేది.’

‘ఎన్నికలప్పుడు 6000 పాఠశాలలు మూతపడ్డాయి అని అబద్దం చెప్పిన మీరు, ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే బాగుండేది. “మన ఊరు మన బడి” కార్యక్రమం ఎందుకు ఆపేసారో చెప్తే బాగుండేది. 6 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన గురుకులాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నది అని చెప్తే బాగుండేది. ప్రభుత్వ పాఠశాలలో “బ్రేక్ ఫాస్ట్ స్కీమ్” ఎందుకు ఆపేశారో చెప్తే బాగుండేది. ఎన్నికల సమయంలో చెప్పినట్టు ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో చెప్తే బాగుండేది. 19 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న మీరు మిగితా పాఠశాలలను గాలికి వదిలేశాము అని చెప్తే బాగుండేది’ అని సబితా ఇంద్రారెడ్డి ఎక్స్‌లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *