Modi Celebrating 75th Birthday

Modi Celebrating 75th Birthday: నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానిగా మూడోసారి విజయవంతంగా కొనసాగుతున్నారు. 2014 నుంచి నిరంతరంగా దేశాన్ని నడిపిస్తూ, ఇందిరా గాంధీ రికార్డును కూడా అధిగమించారు. సెప్టెంబర్ 17న 75వ వసంతంలోకి అడుగుపెట్టిన మోడీకి దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, మోడీని మంచి స్నేహితుడని అన్నారు. మోడీ 1950లో గుజరాత్‌లోని వాదీనగర్‌లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే ఆరెస్సెస్‌లో చేరి ప్రచారక్‌గా శిక్షణ పొంది, హిందూ జాతీయవాదం, క్రమశిక్షణ, సామాన్య ప్రజలతో అనుబంధాన్ని పెంపొందించుకున్నారు.

2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ, రాష్ట్రాన్ని 12 ఏళ్లపాటు నడిపించి “గుజరాత్ మోడల్” పేరుతో గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత 2013లో బీజేపీ అతనిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంచుకుంది. దేశవ్యాప్తంగా గుజరాత్ మోడల్ ప్రచారం చేసి 2014లో బీజేపీని ఘన విజయం వైపు నడిపించారు. అనంతరం 2019, 2024 ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించారు. ప్రస్తుతం మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Internal Links:

ఎర్రమట్టి దిబ్బలు కోసం పవన్ కళ్యాణ్ పోరాటం ఫలించింది.

వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..

External Links:

75వ బర్త్‌డే చేసుకుంటున్న మోడీ.. రాజకీయ ప్రస్థానమిదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *