బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే . ఈరోజు న్యాయస్థానం విచారించింది. విచారణలో భాగంగా బాధ్యత కలిగిన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కోర్టు తెలిపింది. అందులోనూ ఒక ప్రజా ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతకరం అని పేర్కొంది.
అలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయంది. మరోసారి కేటీఆర్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, తదితర ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.