ఒకే దేశం, ఒకే ఎన్నికలను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మధ్యంతర ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచారు. ఈ క్రమంలో కేంద్రం ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *