వైసీపీ అధినేత జగన్‌కు పాస్‌పోర్టు సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో జగన్ దౌత్య పాస్‌పోర్టు రద్దయింది. అందుకే సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో జగన్‌కు ఐదేళ్ల సాధారణ పాస్‌పోర్టు ఇవ్వాలని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే విజయవాడలోని ప్రజాప్రతినిధి కోర్టు పాస్‌పోర్టు చెల్లుబాటును ఏడాదికే పరిమితం చేసింది. మరోవైపు ఎన్ ఓసీ తెచ్చుకోవాలంటూ జగన్ కు పాస్ పోర్టు కార్యాలయం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
వాదనల సందర్భంగా జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పారు. మరోవైపు పాస్ పోర్ట్ కార్యాలయం న్యాయవాది వాదనలు వినిపిస్తూ, జగన్ పై ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు. కోర్టు నుంచి ఎన్‌ఓసీ తీసుకురావాలని పాస్‌పోర్ట్ కార్యాలయం కూడా జగన్‌కు లేఖ రాసిందని తెలిపారు. దీంతో జగన్ పాస్ పోర్టుకు ఎన్ ఓసీ ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఈ తదుపరి విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పాస్ పోర్టు సమస్యల కారణంగా జగన్ లండన్ పర్యటన వాయిదా పడింది.