ఫామ్‌హౌస్‌లో కోడి పందాల కేసులో మొయినాబాద్ పోలీసులు మరోసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వారు మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అతికించారు. శుక్రవారం తమ ముందుకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కేసు వివరాల్లోకి వెళితే, గత నెలలో తొల్కట్టలోని ఫామ్‌హౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందాలు, క్యాసినో జరిగాయి. ఆ సమయంలో, పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఫామ్‌హౌస్ యజమాని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చారు. ఆ ఫామ్‌హౌస్‌ను తానే లీజుకు తీసుకున్నానని పోలీసులకు చెప్పాడు. ఈ కేసులో పోలీసులు అతనికి నోటీసు జారీ చేయడం ఇదే మొదటిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *