News5am, Breaking Telugu News (14-05-2025): రోహిత్ శర్మ రాజకీయాల్లోకి అడుగుపెడతాడా? బీజేపీలో చేరతాడా? అనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షలో ముఖ్యమంత్రిని కలవడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. రోహిత్ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు ఇప్పటికే రిటైర్ అయిన సంగతి తెలిసిందే. టెస్ట్ రిటైర్‌మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ను కలవగా, అదే సమయంలో రోహిత్ సీఎం ఫడ్నవీస్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆయన సీఎం పిలుపు మేరకే వెళ్లినట్టు సమాచారం.
ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చే ఘటనలు కొత్తేమీ కాదు కానీ, రోహిత్ తక్షణ రాజకీయ ప్రవేశంపై అభిమానుల్లో సందేహమే ఎక్కువగా ఉంది. రోహిత్ వన్డేల్లో ఇంకా 2-3 ఏళ్లు కొనసాగొచ్చని అభిమానులు భావిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో అతడు ఆడతాడని ఆశిస్తున్నారు. అయితే ఫడ్నవీస్‌తో భేటీ తర్వాత, రోహిత్ వన్డేలకు కూడా త్వరలో గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
More Telugu Breaking News
నేడు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం..
ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 24 ఎన్డీఏ కీలక భేటీ..
More News: External Sources
రాజకీయాల్లోకి రోహిత్ శర్మ..?: మహారాష్ట్ర సీఎంతో స్పెషల్ మీటింగ్..!