RBI Governor Sanjay Malhotra

RBI Governor Sanjay Malhotra: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన RBI బోర్డ్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను గవర్నర్ ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణలను వివరించగా, ముఖ్యంగా విద్యుత్ రంగంలో మార్పులు, మూడో డిస్కం ఏర్పాటు అంశాలపై చర్చ జరిగింది.

అలాగే సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా BUDS యాక్ట్‌ను నోటిఫై చేయాలని RBI గవర్నర్ ముఖ్యమంత్రిని కోరారు. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)పై RBI తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్ అంశాలపై కూడా గవర్నర్ సీఎంకు వివరించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

సీఎం రేవంత్ రెడ్డితో.. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *