తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు 11 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో మకాం వేశారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కోకాపేటలోని జీఏఆర్‌ బిల్డింగ్‌ సమీపంలో ఏర్పాటు చేయనున్న కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు.

దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. కోకాపేటలోని బహుళ అంతస్తుల జీఏఆర్‌ టవర్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కొత్త క్యాంపస్‌లో 15,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. కాగ్నిజెంట్ 2002లో ఉమ్మడి APలో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *