Revanth Reddy Zoom meeting: మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 9 సాయంత్రం 6:30 నుంచి జూమ్ మీటింగ్ ద్వారా మంత్రులతో చర్చలు జరుపుతూ క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇవాళే చివరి రోజు కావడంతో పోలింగ్ మేనేజ్‌మెంట్‌పై కీలక సూచనలు చేశారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. చివరి రోజు కావడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో 9 సాయంత్రం 5 తర్వాత నుంచి 11న పోలింగ్ ముగిసే వరకు సభలు, ర్యాలీలు నిషేధించబడ్డాయి. బయట నుంచి వచ్చిన నాయకులు పట్టణాలను విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఈ సమయంలో పోలింగ్ ఏర్పాట్లు కొనసాగుతుండగా, సైలెన్స్ పీరియడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
మున్సిపల్ ఎన్నికలు..మంత్రులతో అత్యవసరంగా సీఎం జూమ్ మీటింగ్