Sarpanch Election Results: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రెబల్స్‌ను నియంత్రించకపోవడం, బంధువులకు టికెట్లు ఇప్పించడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతమైతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అదే సమయంలో, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులను సీఎం అభినందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించిందని, ప్రజలు తమ పాలనపై విశ్వాసం చూపారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని, ఇది తమ పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా పేర్కొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
“సర్పంచ్” ఫలితాలపై పీసీసీ సమీక్ష.. 18 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్..