ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు కాసేపు థింసా నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు.
గిరిజనుల వద్దకు వెళ్లి పలకరించారు. అనంతరం డప్పులు కొట్టి గిరిజనులతో మమేకమయ్యారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు. గిరిజనుల తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలకు వెళ్లి, వాటిని పరిశీలించారు. అంతకుముందు అరకు కాఫీ తాగారు.