Telangana Assembly Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రసంగిస్తారు. ఉదయం 11:25కి గవర్నర్ అసెంబ్లీకి చేరుకుని, 11:45కి ప్రసంగం ప్రారంభం కానుంది. ఇటీవల గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్ల మొదటిసారి అసెంబ్లీకి హాజరవుతున్నారు. ప్రభుత్వం ఈ సమావేశాలను సుమారు 10 రోజుల పాటు నిర్వహించాలని యోచిస్తోంది. సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు, అయితే ఆ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది.
ఈ సమావేశాల్లో గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం, వారి హక్కుల పరిరక్షణ, విద్యారంగంలో కొత్త విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, సోషల్ మీడియా నియంత్రణ వంటి అంశాలపై చర్చ జరగనుంది. అలాగే మూసి నది ప్రక్షాళన, నదీ జలాల అంశం, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి విషయాలు కూడా సభలో ప్రస్తావనకు రానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమై భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లపై చర్చించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ చాంబర్‌లో బీఏసీ సమావేశం జరగనుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!