తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు వెళ్ళనున్నారు. ముంబైలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఆయన మహారాష్ట్ర వెళ్లనున్నారు ఉ. 8 గంటలకు శంషాబాద్ నుంచి ముంబైకి చేరుకోనున్నారు. ముంబైలో అక్కడి కాంగ్రెస్ సీఎంల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అ సరించాల్సిన వ్యూహం, రూపొందించాల్సిన మేనిఫెస్టోపై సలహాలు, ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు, పలువురు ముఖ్యనేతలు పాల్గొననున్నారు. కాగా ఈ ఎన్నికల్లో రేవంత్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు.