తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత కేబినెట్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతోంది. మహిళా మంత్రిగా ఉంటూ మరో మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి? సినీ పరిశ్రమ మొత్తం ట్విట్టర్ వేదికగా మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ స్పందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్ చేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇలాంటివి జరగకుండా మంత్రి కొండా సురేఖకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నామని ఆయన అన్నారు.

సురేఖ చేసిన వ్యాఖ్యలు నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానించాయని ఆయన అన్నారు. తన రాజకీయ ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో, అత్యంత గౌరవనీయమైన నాగార్జున కుటుంబాన్ని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం సరైనదికాదన్నారు.మంత్రి హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్య లాంటి గౌరవప్రదమైన కుటుంబంపై, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ నటిపై ఇలాంటి నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నామని ఆర్జివి ట్టిట్టర్ ద్వారా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *