ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ అక్కడి రాష్ట్ర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇతర కీలక శాఖల కార్యదర్శులు ఉన్నారు. వీరితో పాటు ఇతర కార్యదర్శులు జూమ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటారు.
ప్రధానంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, సహకారం లాంటి వాటిపై శాఖల వారీగా అప్ డేట్స్ పై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సమయం ఉంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలనూ ముఖ్యమంత్రి కలిసే ఛాన్స్ ఉంది. అలాగే, వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కలిసి, ప్రత్యేక అభినందనలు తెలుపనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.