Telangana Municipal Elections Nomination: నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో పట్టణాల్లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డులకు 19,608 నామినేషన్లు దాఖలవడం ఎన్నికలపై భారీ ఆసక్తిని చూపిస్తోంది. ఉపసంహరణ అనంతరం స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించనుండగా, ప్రచారం మరింత ఊపందుకోనుంది.
ఇక కొన్ని పార్టీలు ఇంకా బిఫారాలు ఇవ్వకపోవడంతో అభ్యర్థుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిఫారాలు, నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలే చివరి గడువు. బిఫారం దక్కని వారు స్వతంత్రులుగా బరిలో దిగితే పార్టీలకు ఇబ్బందులు తప్పవు. దీంతో రెబల్ అభ్యర్థులను తప్పించేందుకు నేతలు బుజ్జగింపులు, కీలక సమావేశాలతో బిజీగా మారనున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
నేడే మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు.. బుజ్జగింపులు షురూ!