మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం మేరకు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారు. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీకి చేరుకోనున్నారు.
గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలు, అజెండాపై నిర్ణయం తీసుకోనున్నారు.