ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారాని ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 20వ తేదీన ఆయనతో పాటు పలువురు మంత్రులు సరిగ్గా సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా, ఆశీష్ సూద్ ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ 48 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక అధికార ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టబోతోంది.